దేశంలో ఉమ్మడి పౌరసత్వ చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యయుతంగా చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఉమ్మడి పౌరసత్వం అమలుకు బీజేపీ కట్టుబడి ఉందని వివరించారు. సెక్యులర్ దేశంలో మతం ఆధారంగా చట్టం ఉండకూడదు అని తెలిపారు. వివిధ మతాల వారు ఉమ్మడి పౌరసత్వంపై తమ అభిప్రాయాలను తెలియజేయాలి అని అన్నారు.