శ్రీకాకుళం జిల్లా వైయస్సార్సీపి పార్టీ అధ్యక్షుడిగా నరసన్నపేట శాసనసభ్యులు ధర్మాన కృష్ణ దాస్ కు వైయస్ జగన్మోహన్ రెడ్డి నియమించడం పట్ల పలువురు అభినందనలు వ్యక్తం చేశారు. రాష్ట్ర పశువర్ధకశాఖ మాత్యులు సిదీరి అప్పల రాజు, పలాస మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ బల్ల గిరిబాబు తో పాటు పాలిన శ్రీనివాసరావు అభినందనలు తెలియజేశారు. గురువారం రాత్రి కృష్ణ దాస్ ఇంటికి వెళ్లి 2024 ఎన్నికల్లో జిల్లాలో అన్ని స్థానాలు వైయస్సార్ పార్టీ సాధించే ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కృష్ణ దాసుని కోరారు. అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి ఎంపిక చేసినందుకు ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.