ఏపీలో అటెండెన్స్ కోసం తెచ్చిన ఫేషియల్ రికగ్నేషన్ యాప్ ఓ ఉపాధ్యాయుడు సస్పెండ్ అయ్యేలా చేసింది. సత్యసాయి జిల్లా మేలాపురంలో టీచర్ ఆదినారాయణ అక్టోబర్ 5న గుండు గీయించుకున్నాడు. అనంతరం ఫోటో ఒకేలా లేకపోవడం వల్ల యాప్ రిజెక్ట్ చేసింది. దీంతో అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 17న ఆయనకు విద్యా శాఖ మెమో ఇవ్వగా.. మీడియాకు లీక్ చేయలేదని వివరణ ఇచ్చినా తాజాగా సస్పెండ్ చేశారు. అయితే యాప్ లోపాలు సరి చేయకుండా ఇలా చేయడంపై విమర్శలు వస్తున్నాయి.