కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని చంపుతానని బెదిరిస్తూ లేఖ రాసిన వ్యక్తిని మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు దయా అకా ప్యారే అకా నరేంద్ర సింగ్ గా పోలీసులు గుర్తించారు. నగ్డా ప్రాంతంలో అతడిని అరెస్ట్ చేసి ఇండోర్ పోలీసులకు అప్పగించారు. రాహుల్ భారత్ జోడో యాత్ర కోసం ఇండోర్ కు రాగానే బాంబు పేలుస్తానని బెదిరిస్తూ లేఖ రాశాడని పోలీసులు తెలిపారు.