కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బుల్లెట్ లా దూసుకెళ్తూ ప్రయాణ సమయం తగ్గించేలా ఈ రైలును ప్రవేశపెట్టారు. అయితే విశాఖ- విజయవాడ మధ్యలో ఈ రైలును తిప్పనున్నట్లు సమాచారం. వాల్తేరు డివిజన్ కు ఈ రైలును కేటాయించారు. త్వరలోనే విశాఖకు రానున్న ఈ 8 కోచ్ ల రైలుకు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. అయితే ఈ రైలు పట్టాలెక్కితే కేవలం నాలుగు గంటల్లోనే విశాఖ నుండి విజయవాడకు చేరుకోవచ్చు. ఈ రైలులో చైర్ కారులో టిక్కెట్టు రూ.850 ఉండగా, ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో రూ. 1650 వరకు ఉండే అవకాశముంది.