టెక్ దిగ్గజం యాపిల్ సంస్థకు బ్రెజిల్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. బ్రెజిల్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున ఐఫోన్లను సీజ్ చేశారు అక్కడి అధికారులు. కాగా, యాపిల్ కంపెనీ ఐఫోన్లతో పాటు ఛార్జర్లు ఇవ్వడాన్ని ఎప్పుడో నిలిపివేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన బ్రెజిల్ ప్రభుత్వం ఫోన్ తో పాటు ఛార్జర్ ఇవ్వకపోవటాన్ని తప్పబడుతూ గతంలో రెండు సార్లు జరిమానా విధించింది . ఫోన్ తో పాటు తప్పకుండా చార్జర్ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ సంస్థలో ఎటువంటి మార్పు లేదు. దీంతో బ్రెజిల్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని రిటైల్ స్టోర్లలో మరోమారు దాడులు నిర్వహించి యాపిల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు.