గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ అధికార బీజేపీ సహా ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఆప్, కాంగ్రెస్ ఉచితంగా విద్యుత్ ఇస్తామని ప్రకటించాయి. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ ఇది ఉచిత విద్యుత్ ఇచ్చే సమయం కాదని, కరెంటు నుంచి ఆదాయం పొందే సమయమని వ్యాఖ్యానించారు. సౌర విద్యుత్ ను వాడుకోగా మిగిలిన విద్యుత్ ను 'మొడేరా' గ్రామం ప్రభుత్వానికి అమ్ముకుంటూ ఆదాయం ఆర్జిస్తోన్న విషయాన్ని మోదీ గుర్తు చేశారు.