అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పాల్తూరు నుంచి కరకముక్కల పోవు రహదారిపై ప్రయాణికులు, రైతులు పోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు పనులు చేస్తూ పనులు మూడు నెలల నుంచి నిలపివేయడంతో కంకర రాళ్లుపై రాకపోకలు కొనసాగిస్తున్నట్లు గ్రామ రైతులు వాపోతున్నారు. నెలలు గడుస్తున్నా పనులు చేయకపోవడంతో వ్యవసాయ పొలాలకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. ఇప్పటికేన ఆధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.