ప్రొద్దుటూరు స్థానిక వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం రక్తదాన శిబిరం నిర్వహించారు. స్టార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 63 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. ప్రొద్దుటూరు జిల్లాప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ నందు రక్తనిల్వలు తక్కువగా ఉన్నాయని అధికారులు తెలిపారని స్టార్ ఫౌండేషన్ అధ్యక్షుడు సిరాజుద్దీన్ తెలిపారు. రక్తదానం శిబిరం ఏర్పాటు కొరకు ప్రిన్సిపల్ గోవర్ధన్ ను సంప్రదించగా కళాశాల ఆవరణలో శిబిరం ఏర్పాటుకు అనుమతి ఇచ్చారని తెలిపారు. కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది కవిత, ప్రసాద్, ఫౌండేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.