ఇళ్లులేని వారికి అందరికీ ఇళ్లు ఇవ్వడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఇళ్ల నిర్మాణంపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని, ప్రతి శనివారం హౌసింగ్ డేగా పాటించాలని సూచించారు. ఆ రోజు తప్పనిసరిగా అధికారులు లే అవుట్లను సందర్శించాలన్నారు. ఇళ్ల నిర్మాణం నాణ్యతలో ఎలాంటి రాజీ వద్దని, అనుకున్న సమయానికల్లా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు.