నెల్లూరు కోర్టులో చోరీ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని, సీబీఐ విచారణలో నిజాలు నిగ్గుతేలుతాయని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వాస్తవానికి ఆ కేసును సీబీఐకి అప్పగించాలని తానే అఫిడవిట్ ఫైల్ చేశానని చెప్పారు. మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తాను ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఆ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని ఏపీ హైకోర్టుకు కూడా తెలిపానని చెప్పారు. సీబీఐ విచారణలో వాస్తవాలు వెల్లడవుతాయని, దీని వెనుక ఎఎవరెవరు ఉన్నారనేది బయటకు వస్తుందన్నారు. టీడీపీ నేతలు తనపై అసత్య ఆరోపణలు చేశారని మండిపడ్డారు.