మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీకి చెందిన కీలక నేతలు, కార్యకర్తలు వైయస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. మంగళగిరి నియోజవర్గం దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు గ్రామం నుంచి 250 మంది యువత టిడిపిని వీడి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సమక్షంలో వైయస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. వీరికి ఆళ్ల రామకృష్ణారెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులకు ఆకర్శితులై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు అదేవిధంగా రాజకీయంగా బీసీలకు ఇస్తున్న ప్రోత్సాహానికి, మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్కే ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులమై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వాళ్ళు తెలిపారు.