ప్రతి గడపకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. వెంకటాపురం గ్రామంలో గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ నిర్వహించారు. 109వ రోజు 206 గడపల ప్రజలను కలిసిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ప్రతి ఇంటికీ తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను -పనితీరును వివరించారు. ఈ సందర్భంగా ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మూడేళ్ల పాలనలో ప్రతి గడపకు సంక్షేమ పథకాల ఫలాలు అందాయని,అర్హులైన ప్రతి ఒక్కరికి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే సంక్షేమ పథకాల లబ్ధి అందేలా ప్రభుత్వం పనిచేసిందన్నారు.గతంలో సంక్షేమానికి తూట్లు పొడిచి జన్మభూమి కమిటీలకు అధికారాలు అప్పజెప్పి ఇంటిపై జెండా కడితేనో లేదా పార్టీ కండువా కప్పుకుంటేనో సంక్షేమ పథకాలు ఇచ్చే వారిని,కానీ నేడు తెలుగుదేశం పార్టీ వారికి కూడా అర్హులు అయితే చాలు సంక్షేమ పథకాలను వైయస్ జగన్ ప్రభుత్వం ఇస్తుందన్నారు.సంక్షేమ పథకాల అమలుతో పాటు విద్యా -వైద్య రంగాలకు ప్రాధాన్యమిస్తూ ఆయా రంగాల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టి ప్రజలకు మరింత మేలు చేకూరేలా ముఖ్యమంత్రి వైయస్ జగన్ చర్యలు తీసుకున్నారన్నారు.పేద కుటుంబాలకు కూడా నాణ్యమైన ఉచిత విద్య,మెరుగైన ఉచిత వైద్యం అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.అర్హత కలిగిన ఎవరికైనా సంక్షేమ పథకాలు అందకపోతే స్థానిక సచివాలయంలో దరఖాస్తు చేసుకొని లబ్ధిని పొందాలని సూచించారు