ఏపీ సీఎం జగన్ ఇవాళ మున్సిపల్ శాఖపై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు పలు అంశాల్లో దిశానిర్దేశం చేశారు. నగరాలు, పట్టణాల్లో మున్సిపల్ సేవల కోసం తీసుకొస్తున్న ఏపీ సీఎం ఎంఎస్ యాప్ గ్రామాల్లోనూ అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఇలాంటి ఫిర్యాదులను ఈ యాప్ ద్వారా పరిష్కరించే వ్యవస్థ పటిష్టంగా ఉండాలని స్పష్టం చేశారు.