ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న భూహక్కు కార్యక్రమంలో భాగంగా, భూరీసర్వేలో సర్వేయర్లు కీలక పాత్ర పోషించాలని, తంబళ్లపల్లి తహసీల్దార్ కళావతి సూచించారు. శుక్రవారం ఆమె సర్వేయర్లతో సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఇప్పటికే మండలంలోని కోటకొండ, యర్రసానిపల్లె గ్రామపంచాయతీల్లో సర్వే నిర్వహించామని, అలాగే మిగతా పంచాయతీల్లో సర్వే ప్రారంభించాలని సూచించారు. వీఆర్వోలు, వీఏఓలు పాల్గొన్నారు.