ముంబైలోని తుర్బే నాకా వద్ద దారుణం జరిగింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇసామ్ (40) స్థానికంగా నివాసం ఉంటున్నాడు. స్థానికంగా ఓ మహిళతో అతడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంలో ఇసామ్తో మహిళ అల్లుడు మోను రాజ్ కుమార్ దీక్షిత్ గొడవ పడ్డాడు. తన స్నేహితుడు హేమేంద్ర గుప్తా సాయంతో ఇసామ్పై రాజ్ కుమార్ గురువారం దాడి చేశాడు. తలను నేలకేసి కొట్టి, ఇటుకలతో దాడి చేయడంతో ఇసామ్ ప్రాణాలు విడిచాడు. నిందితులు రాజ్ కుమార్ దీక్షిత్, హేమేంద్ర గుప్తాలు నేరం అంగీకరించడంతో, వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో ప్రవేశపెట్టగా నిందితులకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు.