జగ్గయ్యపేట పట్టణంలోని సిద్దిలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శివపార్వతుల కళ్యాణం వైభవంగా జరిగింది. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఉంచి కళ్యాణ క్రతువులను ఆలయ ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. కంకణధారణ, యజ్ఞోప వేదం, జీలకర్రా - బెల్లం, మాంగళ్యధారణ, ముత్యాల తలంబ్రాలు వంటి కళ్యాణ క్రతువులను ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ఏక, పంచ, సూర్య, చంద్ర, నక్షత్ర కర్పూర హారతులు ఇచ్చి భక్తులకు తీర్ధప్రసాదాలు అందించారు.