ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుమార్తెను గొంతు కోసి చంపిన తల్లి

national |  Suryaa Desk  | Published : Mon, Nov 28, 2022, 11:00 AM

భర్తపై కోపాన్ని ఓ మహిళ తన కుమార్తెపై చూపించింది. బాలికను గొంతు కోసి చంపేసింది. ఈ ఘటన యూపీలోని బిజ్నౌర్ జిల్లా ఔరంగపూర్ పరిధి భిక్కు గ్రామంలో జరిగింది. అంకిత్, శివానిలకు మూడేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఏడాదిన్నర వయసు ఉన్న పాప ఉంది. దంపతులిద్దరూ తరచూ గొడవ పడుతున్నారు. శనివారం కూడా వారి మధ్య గొడవ జరగగా కుమార్తెను శివాని చంపేసింది. కుమార్తె మృతిపై అనుమానాలున్నాయని పోలీసులకు అంకిత్ ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో శివాని తన నేరం అంగీకరించడంతో ఆమెను అరెస్ట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com