చైనాలో కరోనా వ్యాప్తి తీవ్రంగా కొనసాగుతోంది. గత నాలుగు రోజులుగా దేశంలో 30 వేలకు పైనే కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడికి అక్కడి ప్రభుత్వం అమలు చేస్తున్న జీరో కోవిడ్ పాలసీ ఫలితమివ్వడం లేదు. కఠిన ఆంక్షలతో ప్రజలు ఆకలికి మాడి చనిపోతున్నారని, వైరస్ వ్యాప్తం మాత్రం తగ్గడంలేగని చైనీయులు ఆందోళన చేస్తున్నారు. ఆంక్షలు తొలగించాలంటూ బీజింగ్, షాంఘై, షింజియాంగ్ నగరాల్లో ఆందోళనలు చేపడుతున్నారు. తాజాగా చైనాలో 40.347 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 3822 మందికి లక్షణాలు ఉండగా, మిగతా 36525 మందిలో లక్షణాలు కనిపించలేదు.