న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో భారత జట్టు ఎంపికపై టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అసహనం వ్యక్తం చేశాడు. మేనేజ్‌మెంట్ ఎలా ఆలోచిస్తుందో తెలియట్లేదని, ఒక్క మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన ఆటగాళ్లను పక్కనపెట్టడం సరికాదని ఆశిష్ నెహ్రా విమర్శించాడు.
తప్పుడు నిర్ణయాలతో జట్టును భ్రష్టు పట్టించవద్దంటూ ఘాటు విమర్శలు చేశాడు. సంజూ శాంసన్ గురించి స్పందిస్తూ.. ఒకవేళ తాను సెలక్టర్‌గా ఉంటే.. సంజూను కాదని దీపక్ హుడానే ఆడించేవాడినన్నాడు. అయితే మెరుగైన ప్రదర్శన కనబరస్తున్నప్పటికీ ఇలా ఒక్క మ్యాచ్ తర్వాత మళ్లీ పక్కన పెట్టడం సరికాదని మరో మాజీ క్రికెటర్ మురళీ కార్తిక్ సంజూకి అండగా నిలిచాడు.