ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ రైతులకు గుడ్ న్యూస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 28, 2022, 11:54 AM

ఏపీలోని రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. రైతుల అకౌంట్లలో నగదు జమచేయనున్నారు. రూ.లక్షలోపు పంట రుణాలకు వడ్డీ రాయితీ, విపత్తులతో పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీని ఏపీ ప్రభుత్వం అందించనుంది.  దీంతోపాటు గతంలో సాంకేతిక కారణాలతో గతంలో చెల్లింపులు జరగని రైతుల ఖాతాల్లో కూడా నగదు జమచేయనుంది. దాదాపు రూ.200 కోట్లపైగా నగదును సోమవారం 11గంటలకు సీఎం జగన్మోహన్‌రెడ్డి.. నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 45,998 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. అంతకుముందు కురిసిన భారీ వర్షాలతో దాదాపు 60,832 వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల కింద 2020-21 రబీ, 2021 ఖరీఫ్‌ సీజన్లలో రూ.లక్షలోపు రుణాలు తీసుకుని, వడ్డీతోసహా చెల్లించిన 8,22,411 మంది రైతులకు వడ్డీ రీఎంబర్స్‌మెంట్‌ కింద రూ.160.55కోట్లు, ఖరీఫ్ లో వర్షాలకు నష్టపోయిన 45,998 మంది రైతులకు రూ.39.39కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీని సీఎం జగన్ రైతులకు అందించనున్నారు.అయితే, దీనికి అర్హులో కాదోనన్న విషయాన్ని రైతు భరోసా కేంద్రానికి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com