ముంబైలోని భాందప్ వెస్ట్ ప్రాంతంలో దారుణం జరిగింది. బసంత్ సాహా, రీటాదేవి దూబే భార్యాభర్తలు. వీరిద్దరికీ తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఓ వ్యక్తితో రీటాదేవి తరచూ ఫోన్లో మాట్లాడేది. ఆ వ్యక్తి తన భార్య ఎఫైర్ పెట్టుకుందని బసంత్ అనుమానించే వాడు. శనివారం మధ్యాహ్నం కూడా రీటాదేవి ఫోన్ మాట్లాడింది. దీంతో ఆమెతో బసంత్ సాహా గొడవ పడ్డాడు. కోపంలో వంటగదిలోని పాన్‌తో భార్య తలపై బలంగా కొట్టాడు. తీవ్రగాయాలపాలైన రీటాదేవి ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ చనిపోయింది. నిందితుడు బసంత్ సాహాను పోలీసులు అరెస్ట్ చేశారు.