అంతరాలు తగ్గించటానికి ఏకైక ఔషధం విద్య అని, అటువంటి ఆలోచనా విధానాలు, ఆశయాలను ముందుకు తీసుకుని వెళుతున్న నాయకుడు వైయస్ జగన్ అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. అందుకే ఇంగ్లీష్ మీడియం విద్యను అమలు చేస్తున్నారని, వైయస్సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే బలహీన వర్గాల్లోనూ ఉన్నత చదువులు చదవాలన్న ఆకాంక్ష కలిగిందన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ద్వారా వారి కలలను నెరవేర్చుకోగలిగారని, చంద్రబాబు 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ ప్రక్రియకు ఆటంకం కలిగిందని, పూలే ఆశయాల సాధకుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్ అని ఆయన వ్యాఖ్యానించారు.