బ్లాక్ టీ ఆరోగ్యానికి చాలా మందిదని నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ టీ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బ్లాక్ టీ తాగటం వల్ల కొలెస్ట్రాల్ తగ్గి గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. అయితే రోజూ బ్లాక్ టీ తాగేవారు వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా ఉంటారని తాజాగా ఆస్ట్రేలియా పరిశోధకులు గుర్తించారు. చిన్ననాటినుంచి రోజూ కప్పు బ్లాక్ టీ తాగిన 881 మంది 80ఏండ్ల వయస్సుగల మహిళలపై అధ్యయనం నిర్వహించారు. వీరిలో గుండెపోటుకు కారణమయ్యే ప్రమాదకర ఉదర బృహద్ధమని గట్టిపడడం కనిపించలేదు.