ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రాజధాని విషయంలో హైకోర్టు ఇచ్చిన పలు ఆదేశాలపై సుప్రీం స్టే విధించింది. సోమవారం సుప్రీంకోర్టు రాజధానిపై విచారణ జరిపింది. కాలపరిమితితో రాజధాని పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే విధించింది. " అంతా ఒకే చోట కేంద్రీకరిస్తే ఎలా? హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానరా? రెండు నెలల్లో నిర్మాణం చేయాలంటారా? అభివృద్ధి ఎలా చేయాలి అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కదా? ఈ విషయంలో హైకోర్టు తన పరిధిని అతిక్రమించింది " అని సుప్రీం వ్యాఖ్యానించింది. రాజధాని ఇదే ప్రాంతంలో ఉండాలని, ఓకే ప్రాంతాన్ని అభివృద్ది చేయాలని రాష్ట్రానికి చెప్పలేమని తదుపరి విచారణ జనవరి 31కి వాయిదా వేసింది.