తోటకూరలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.తోటకూరలో విటమిన్ ఏ, సీ, కాల్షియం, మాంసకృత్తులు, ఐరన్ అధిక మోతాదులో ఉంటాయి.చిన్నపిల్లల ఎదుగుదలకు తోటకూర ఎంతగానో ఉపయోగపడుతుంది. తోటకూరలో ఉండే పోషకాలు గర్భిణీ బిడ్డ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. తోటకూరను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కంటి సమస్యలు దరిచేరవు. అంతే కాకుండా ఊబకాయం నుంచి విముక్తి పొందాలనుకునే వారు దీనిని తరచూ తినడం మంచిది.