మానసిక వికలాంగురాలైన 13 ఏళ్ల వికలాంగ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ తండ్రికి కేరళ కోర్టు 107 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.4 లక్షల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో ఐదేళ్లు జైలు శిక్ష విధించాలని సూచించింది. పతనంతిట్ట జిల్లాలోని ఓ గ్రామంలో మతిస్థిమితం లేని వికలాంగ కూతురిపై నిందితుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె తప్పించుకుని స్థానికులు, స్కూల్ టీచర్ సహాయంతో ఛైల్డ్ లైన్ కార్యకర్తలకు సమాచారం అందించింది. నిందితుడిపై 2020లో కేసు నమోదు కాగా కోర్టు దోషిగా నిర్ధారించింది.