రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు మంజూరవుతున్నాయని 55 డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పేర్కొన్నారు. కడప నగరంలోని 11వ డివిజన్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీలో మంగళవారం ఉదయం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులతో ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాల మంజూరు, స్థానిక ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.