చెన్నైలోని సబర్బన్ రైలులో ఓ వ్యక్తి మద్యం తాగి వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో ట్రైన్లోని మహిళను గట్టిగా హత్తుకున్నాడు. సోమవారం సాయంత్రం చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఈ ఘటన జరిగింది. తోటి ప్రయాణికులు స్పందించి, అతడిని అడ్డుకున్నారు. అయినప్పటికీ అతడు మహిళను వేధించడంతో ప్రయాణికులలో సహనం నశించిపోయింది. ప్రయాణికులంతా అతడికి దేహశుద్ధి చేశారు. అనంతరం రైల్వే స్టేషన్లో పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.