కరోనా టీకా తీసుకున్న తర్వాత ఏవైనా దుష్ప్రభావాలు ఎదురైతే తమ బాధ్యత ఉండబోదని సుప్రీంకోర్టుకు కేంద్రం స్పష్టం చేసింది. గతేడాది కరోనా టీకా తీసుకున్న అనంతరం ఇద్దరు వేర్వేరు యువతులు మరణించడంపై తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. స్పందనగా కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసి పరిహారం కోరడమే మార్గమని పేర్కొంది. 2022 నవంబర్ 19 నాటికి 219.86 కోట్ల కరోనా టీకా డోసులు ఇవ్వగా.. 92,114 కేసుల్లో దుష్ప్రభావాలు కనిపించినట్లు తెలిపింది.