ఆధార్ కార్డు లేకుంటే బడుల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టకూడదని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. యూనిఫాం వంటి ఇతర సదుపాయాలు కూడా కట్ చేస్తామని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధన వచ్చే జనవరి నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన వివరాల ప్రకారం దాదాపు 59 లక్షల మంది చిన్నారులకు ఆధార్ లేకపోవడమో, ఉన్నా వివరాలు తప్పుగా ఉండటమే తదితర సమస్యలున్నాయి.