రాజధాని విషయంలో వివాదం రోజురోజుకి పెరుగుతూనే ఉంది. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ నిధులు కలిపి దాదాపు రూ.15వేల కోట్లు ఇప్పటికే ఖర్చు చేశారు. చట్టబద్ధమైన ఒప్పందం ప్రకారం 29వేల మంది రైతులు రెండెకరాలలోపు భూమిని రాజధాని కోసం ఇచ్చారు. రైతులకు అభివృద్ధి చేసిన స్థలాలు ఇస్తామన్నది ప్రభుత్వ హామీ. అమరావతిలో చాలా పెట్టుబడులు పెట్టారు! సీఆర్డీయేలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. భూములిచ్చిన రైతులతో చట్టబద్ధమైన ఒప్పందం కుదుర్చుకున్నారు. దానిపై నిధులు వెచ్చించారు. ప్రజాధనం, ప్రజా విశ్వాసం, రాజ్యాంగం, నైతికత వంటి వాటిని కలిసికట్టుగా పరిశీలిస్తే ప్రభుత్వం వెనక్కి వెళ్లడాన్ని అనుమతించకూడదు! అని జస్టిస్ జోసెఫ్ తెలియజేసారు.