చైనాలో రోజువారీ కరోనా కేసులు 40 వేలకు పైగా నమోదవుతుండడంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. పలు నగరాల్లో క్వారంటైన్ గదులు, ప్రత్యేక ఆస్పత్రుల నిర్మాణం చేపట్టింది. గ్వాంగ్జూ సిటీ శివార్లలో ప్రత్యేక ఆస్పత్రులను ప్రభుత్వం నిర్మిస్తోంది. సుమారు 2.50 లక్షల మంది వైరస్ బాధితులకు ఆశ్రయం కల్పించవచ్చని ప్రభుత్వ అధికారులు వివరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. చైనా రాజధాని బీజింగ్ సహా ఇతర ప్రధాన నగరాల్లోనూ వైరస్ ప్రమాదకరంగా వ్యాప్తి చెందుతోందని సమాచారం.