అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలో మాజీ ముఖ్యమంత్రి , టీడీపీ వ్యవస్థాపికుడు ఎన్టీఆర్ చిత్రపటానికి గుర్తు తెలియని వ్యక్తులు నల్లరంగు వేశారు. సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో రంగు వ్యహారం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. బీటీ కళాశాల ప్రహరీ గోడపై ఓ దాత రాజకీయ నాయకులైన దివంగత ఎన్టీ రామారావు , వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రాలు గీయించారు. అయితే సీఎం జగన్ మదనపల్లి పర్యటన నేపథ్యంలో బీటీ కళాశాల మైదానంలోని హెలిపాడ్‌లో దిగి ఇదే మార్గంలో రోడ్ షో నిర్వహించనున్నారు. జగన్ ఎక్కడ ఎన్టీఆర్ బొమ్మ చూస్తారోనని ఇలాంటి దుశ్చర్యకు పాల్పడినట్లు టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు నిరసనగా టీడీపీ శ్రేణులు ఆందోళనకు సిద్ధమయ్యారు. అయితే వెంటనే అప్రమత్తమైన పోలీస్ శాఖ... రాత్రికి రాత్రే ఎన్టీఆర్ బొమ్మకు పూసిన నల్ల రంగు స్థానంలో, కొత్తగా మరో ఎన్టీఆర్ బొమ్మను చిత్రీకరింపచేశారు.