రోజు రోజుకి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందనే చెప్పాలి. తాజాగా మంత్రి అంబటి రాంబాబుకు సొంతపార్టీ నేతలు షాక్ ఇస్తున్నారు. సత్తెనపల్లి మండలం, వెన్నాదేవిలో మంత్రి అంబటి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ హాజరుకాలేదు. సర్పంచ్ లేకుండా మంత్రి అంబటి తిరగడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. వెన్నాదేవి సర్పంచ్ గత కొంతకాలంగా మంత్రిపై ఆగ్రహంగా ఉన్నారు. దీంతో కార్యక్రమానికి హాజరుకాలేదు. సర్పంచ్ లేకుండా తిరిగితే గ్రామ సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని స్థానికులు ప్రశ్నించారు.