సమర శంఖారావం పేరుతో తిరుపతిలో గ్రామాల అభివృద్ధికై సర్పంచుల నిరసన కార్యక్రమానికి ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ పిలుపునిచ్చింది. అలిపిరిలో ఉద్యమాన్ని ప్రారంభించి... తిరుమలకు నడిచే వెళ్లే విధంగా నేతలు ప్రణాళికను రూపించారు. ఇప్పటికే కీలక నేతలు అలిపిరికి చేరుకున్నారు. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు తిరుపతికి చెందిన రవినాయుడు, సింగంశెట్టి సుబ్బరాయుడు తదితర నేతలను హౌస్ అరెస్టులు చేశారు. అలిపిరి వద్ద పెద్దఎత్తున పోలీసులు మోహరించారు. మొత్తం 12 డిమాండ్లు రాష్త్ర ప్రభుత్వం ఆమోదించే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నేతలు నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వైవీబీ రాజేంద్రప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాపరెడ్డి, ఏపీ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వానపల్లి లక్ష్మి ముత్యాల రావు పాల్గొననున్నారు.