అమెజాన్ సంస్థ భారత్ లో హోల్ సేల్ ఈ కామర్స్, డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాలను సైతం మూసివేయాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం బెంగళూరు, మైసూరు, హుబ్లీ ప్రాంతాల్లోనే ఈ సేవలు అందిస్తోంది. వేగంగా వినియోగమయ్యే ఉత్పత్తులను కంపెనీల నుంచి నేరుగా కొనుగోలు చేసి, వాటిని స్థానిక కిరాణా షాపులు, ఫార్మసీ, డిపార్ట్ మెంటల్ స్టోర్లకు అమెజాన్ సరఫరా చేస్తుంటుంది. అయితే భారత్ మార్కెట్ లో నష్టాలు రావడంతో మూసివేత నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎడ్ టెక్, ఫుడ్ డెలివరీ వ్యాపారాలను సైతం అమెజాన్ మూసేసేందుకు నిర్ణయించింది.