ఆంధ్రప్రదేశ్‌లోని పెడనకు చెందిన బ్లాక్ మేకింగ్ కళాకారుడు కొండ్ర గంగాధర్, శ్రీకాళహస్తికి చెందిన కలంకారీ హస్తచిత్రకారుడు వేలాయుధం శ్రీనివాసులురెడ్డిలకు ప్రతిష్టాత్మకమైన శిల్పగురు పురస్కారాలు లభించాయి. అలాగే, శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామానికి చెందిన తోలు బొమ్మలాట కళాకారులు దళవాయి కుల్లాయప్పకు 2017 సంవత్సరానికి గాను, దళవాయి శివమ్మకు 2019కి జాతీయ అవార్డులు వరించాయి. వీరిద్దరూ తల్లీ కొడుకులు కావడం విశేషం. అలాగే, కరీంనగర్‌కు చెందిన వెండి, నగిషీ కళాకారుడు గద్దె అశోక్‌కుమార్‌కు జాతీయ పురస్కారం లభించింది. సోమవారం కేంద్ర జౌళిశా ఖ ఆధ్వర్యంలో ఢిల్లీ విజ్ఞానభవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో 2017, 2018, 2019 సంవత్సరాలకు గాను ఉపరాష్ట్రపతి జగదీ్‌పధన్‌కర్ దేశవ్యాప్తంగా 30 మందికి శిల్పగురు అవార్డులను, 78 జాతీయ అవార్డులను ప్రదానం చేశారు. అత్యద్భుతమైన హస్తకళా ప్రతిభను ప్రదర్శించిన కళాకారులకు రూ.2లక్షల నగదు, తామ్రపత్రంతో శిల్పగురు పురస్కారాలను అందించగా, అద్భుత ప్రతిభ కనపరిచిన కళాకారులకు రూ.లక్ష నగదు, తామ్రపత్రం అందించారు.