పల్నాడు జిల్లా, పిడుగురాళ్లలో మతం మారాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఓ మహిళ ఒక వీడియో రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఆమె విడుదల చేసిన వీడియో , వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళ్ళితే.... క్రిస్టియన్ మతంలోకి మారాలని సీతా అనే మహిళపై పాస్టర్ ఒత్తిడి తీసుకువచ్చాడు. బాధితురాలు సీత బోయకాలనీలో నివాసం ఉంటోంది. ఓ పాస్టర్ ఆధ్వర్యంలో తనపై దాడికి వచ్చారని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఇంటి ముందు పారిజాతం చెట్టును తమ కళ్ల ముందే పీకేయాలని హెచ్చరించారని తెలిపింది. ఈ వీధిలో పూజలు చేస్తే పెట్రోల్ పోసి తగలబెడతామని బెదిరించారని... మతం మారితే ఉంటావ్... లేకపోతే పోతావని హెచ్చరించారంటూ సదరు మహిళ తన గోడును వెళ్లబోసుకుంటూ వీడియోను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.