చలికాలంలో ఎక్కువగా బాధించే దగ్గు, జలుబును వంటింటి చిట్కాలతో పోగొట్టుకోవచ్చు. గోరువెచ్చని పాలలో కొంచెం పసుపు వేసి కలిపి, ఆ మిశ్రమాన్ని తాగాలి. గొంతునొప్పి పోవాలంటే కొంచెం పసుపు, ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటితో గార్గిల్ చేయాలి. తులసి ఆకులు నమిలినా ప్రయోజనం ఉంటుంది. లీటర్ నీటిలో 8 తులసి ఆకులు, ఒక చిన్న అల్లం ముక్క, కొన్ని వెల్లుల్లి ముక్కలు, ఒక టీ స్పూన్ వాము, టీ స్పూన్ మెంతులు, పసుపు, 5 నల్ల మిరియాలు వేసి మరిగించి ఉదయాన్నే తాగితే దగ్గు, జలుబు పోతాయి. ఇలాంటి గొంతు సమస్యలు పోవాలంటే అల్లం, పసుపు, లెమన్ టీ తాగితే మంచిది.