ప్రజలందరూ ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే ఆన్లైన్ బ్యాంకింగ్ మోసగాళ్ల ఉచ్చు నుండి తప్పించుకోవచ్చునని జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ కృష్ణ నాయక్ తెలిపారు. వేటపాలెం మండలంలోని చేనేతపురి కాలనీ నందు ఆర్థిక అక్షరం మీద అవగాహనా కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ కృష్ణ నాయక్ మాట్లాడుతూ ప్రజలంతా ఆర్థిక అక్షరాస్యత మీద అవగాహన కలిగి ఉండాలని ఆకాంక్షించారు. జిల్లా పరిశ్రమల శాఖ అధికారి మదన్మోహన్ శెట్టి మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ పథకాలు, ఆన్లైన్ మోసాల గురించి తెలియజేసి, పరిశ్రమల కేంద్రం ద్వారా వివిధ ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుని ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వేటపాలెం, పందిళ్ళపల్లి యూనియన్ బ్యాంక్ మేనేజర్లు శ్రీనివాసరావు, కె. సాంబశివరావు, చేనేతపురి కార్యదర్శి వినయ్ కుమార్, సిఎఫ్ఎల్ కౌన్సిలర్స్ వై. ప్రశాంత్, ఎస్‌దీ. మతీన్, జిల్లా లీడ్ బ్యాంకు క్లర్క్ డి. శ్రీనివాసరావు, వివోఏలు, గ్రామస్తులు పాల్గొన్నారు.