టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది. రూ. 22 కోట్ల ఆస్తులు అటాచ్ చేసింది. బీఎస్ 3 వాహనాల కుంభకోణం కేసులో ప్రభాకర్ రెడ్డి, గోపాల్ రెడ్డికి సంబంధించిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. బీఎస్ 3 వాహనాలను నకిలీ ఇన్‌వాయిస్‌లు సృష్టించి బీఎస్ 4గా మార్చినట్టు ఈడీ గుర్తించింది. నాగలాండ్, కర్నాటక, ఏపీలో రిజిస్ట్రేషన్స్ జరిగినట్టు గుర్తించింది. ఆర్టీవో అధికారులతో నకిలీ పత్రాలు సృష్టించి అక్రమ రిజిస్ట్రేషన్స్ చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈడీ విచారణ ప్రారంభించింది. అశోక్ లేలాండ్ నుంచి స్క్రాప్ లో వాహనాలు కొనుగోలు చేసినట్టు గుర్తించింది. దీనిపై విచారణ ఇంకా కొనసాగుతోంది.