గ్రామ సచివాలయాల సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని నెల్లూరు జేసీ రోణంకి కూర్మనాథ్ ఆదేశించారు. మంగళవారం ఆయన కుల్లూరు, మాదన్నగారిపల్లె సచివాలయాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమయపాలన పాటించని సిబ్బందిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండలంలో జరుగుతున్న సమగ్ర భూ సర్వేను చింతలపాళెంలో ఆయన పరిశీలించారు. మిగిలిన గ్రామాల్లో జరుగుతున్న సర్వే వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సర్వేలో ఎదురౌతున్న సమస్యల పరిష్కారం కోసం సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. త్వరగా సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దారు సోమ్లానాయక్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.