అన్ని గ్రామాల్లోని ఎస్సీ కాలనీలను సందర్శించి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రచారం చేయాలని కందుకూరు టీడీపీ ఇంచార్జి ఇంటూరి నాగేశ్వరరావు చెప్పారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన టీడీపీ ఎస్సీ నాయకులు కందుకూరులోని పార్టీ కార్యాలయంలో నాగేశ్వరరావును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మండలంలోని పలు సమస్యలను నాగేశ్వరరావు దృష్టికి తేవడంతో గ్రామాల్లో సమస్యలను తెలుసుకుంటూ వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. అనంతరం ఎస్సీ నాయకులు నాగేశ్వరరావును శాలువాతో సన్మానించి అంబేడ్కర్ చిత్రపటాన్ని బహూకరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పూరిమిట్ల మాల్యాద్రి, గాలంకి ప్రసాద్, దారా డేవిడ్, బండ్లమూడి రామయ్య, ఏపూరి పద్మారావు, పందల వినయ్, ఒంగోలు అబ్రహాం, విస్తర్ల వెంకట్రావు, కుడారి విష్ణు తదితరులు పాల్గొన్నారు.