'హైపో టెన్షన్'గా పిలిచే 'లో బీపీ'ని అందరూ తేలిగ్గా తీసుకుంటారు. సాధారణంగా రక్తపోటు 120/80 ఉండాలి. 'లో బీపీ'ని తేలిగ్గా తీసుకోకూడదు. ఆహారంలో తగినంత ఉప్పు ఉండాలి. రోజుకు 8 గ్లాసుల నీరు, 8 గంటల నిద్ర తప్పనిసరి. దానిమ్మ, బీట్‌రూట్ జ్యూస్‌లు తాగాలి. ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బీ12 ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. గుడ్లు, చికెన్, క్యారెట్లు, బ్రెడ్లు, టమోటాలు ఆహారంలో భాగం చేసుకోవాలి.