విజయవాడ నగరంలోని ధర్నాచౌక్ పోలీసుల వలయంలో వెళ్లిపోయింది. ఉపాధ్యాయులు ఆందోళన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ధర్నాచౌక్ వైపు వచ్చిన ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు. ఆందోళనకు పోలీసులు ముందుగా అనుమతి ఇచ్చి.. రద్దు చేయడంపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్‌లను పరిష్కరించాలని... తమ ఎకౌంట్లలో సొమ్ములు ప్రభుత్వం తీసుకుందని మండిపడ్డారు. ఇతర అవసరాలకు మళ్లించి హక్కులను హరించారన్నారు. ‘‘మా కష్టార్జితం మాకు ఇవ్వమంటే అరెస్టు లా’’ అంటూ ఆవేదన చెందారు. సకాలంలో డబ్బులు అందక పిల్లల చదువులు, పెళ్లిళ్లు కూడా ఆగిపోతున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఖాతాల్లో వేస్తామని ప్రకటనకే పరిమితం అయ్యిందని విమర్శించారు. తమ డబ్బు తమకు ఇవ్వాలని జగన్‌ను కోరుతున్నామని ఉపాధ్యాయులు తెలిపారు.