నగర ప్రజలకు మౌలిక వసతుల కల్పనే జగనన్న ప్రభుత్వ లక్ష్యమని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. బుధవారం ఆమె 4వ జోన్ 30 వ వార్డు పరిధిలోని కేజీహెచ్, తాడి వీధి లో సుమారు రూ. 39. 64 లక్షలతో సిసి రోడ్డు తారు రోడ్ల నిర్మాణానికి దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్, వార్డ్ కార్పొరేటర్ కోడూరు అప్పలరత్నంతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ పథకాలు, మౌలిక వసతులు కల్పించడంలో జగనన్న ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని, వార్డ్ అభివృద్ధి ప్రణాళిక నిధులు తో రూ 34 లక్షల వ్యయంతో కేజీహెచ్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు తారు రోడ్డు నిర్మాణానికి, అలాగే తాడి వీధిలో "గడప గడప" మన ప్రభుత్వం నిధులతో రూ 5. 64 లక్షల వ్యయంతో సిసి రోడ్డు నిర్మాణానికి స్థానిక శాసనసభ్యులు తో కలిసి శంకుస్థాపన చేసామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో విశాఖ నగరాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పరిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారని అవి అంచెలంచలిగా పూర్తి చేస్తామన్నారు. ముఖ్యంగా ప్రజలకు త్రాగునీరు విద్యుత్తు పారిశుధ్యం రోడ్లు కాలువల నిర్మాణం తదితర పనులకు నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నామని, ప్రతి పేదవాడిని ఉన్నత స్థితికి తీసుకురావాలనే లక్ష్యంతో జగనన్న ప్రభుత్వం పని చేస్తుందని అందుకు ఏ ప్రభుత్వము ప్రవేశ పెట్టలేదని సంక్షేమ పథకాలు మన ప్రభుత్వం ప్రవేశపెడుతుందని తెలిపారు. అనంతరం శాసనసభ్యులు మాట్లాడుతూ అభివృద్ధి లక్ష్యంగా వైఎస్సార్ ప్రభుత్వం పనిచేస్తుందని దక్షిణ నియోజకవర్గ పరిధిలో ప్రతి వార్డును ఒక మోడల్ వాటిగా తీసి తిట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.