బాపట్ల జిల్లా కర్లపాలెం మండల పరిధిలోని నర్రావారి పాలెం గ్రామంలో బుధవారం గ్రామసచివాలయ సిబ్బందితో, వాలంటీర్లతో, గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమం 77 వరోజు జరిగింది. ఈ సందర్భంగా బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కోన రఘుపతి ప్రతి గృహాన్ని సందర్శించి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 3 సంవత్సరాలలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి కరపత్రాల ద్వారా వివరించారు. కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్, గ్రామ కన్వీనర్, ఎం. పి, టి. సి, లు, ఆయా గ్రామ సర్పంచులు, పార్టీ వివిధ శ్రేణుల నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.