యూపీ రాయ్ బరేలీ జిల్లా హారాజ్ గంజ్ తహసీల్ కు చెందిన మహమ్మద్ షరీఫ్ (40) కేవలం రెండున్నర అడుగులు మాత్రమే ఉంటాడు. ఎటువంటి కష్టతరమైన పనులు చేయలేనందున కుటుంబ సభ్యులు ఇంటి నుంచి వెళ్లగొట్టారు. అధికారులను అభ్యర్థించగా ఇల్లు మంజూరైంది. అయితే ఏకాంతంగా ఉండడంతో మానసిక ఇబ్బందులు తలెత్తుతున్నాయని.. తనకు వివాహం జరిపించాలని జిల్లా మేజిస్ట్రేట్ ను వేడుకున్నాడు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆర్థిక సహాయం అందించాల్సిందిగా విన్నవించాడు. దీనికి స్పందించిన మేజిస్ట్రేట్ శ్రీవాస్తవ.. తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.