పుదుచ్చేరిలోని మనక్కుల వినాయకుని సన్నిధిలో ‘లక్ష్మి’ అనే ఏనుగు బుధవారం నడుస్తూనే కుప్పకూలి ప్రాణాలు విడవడం భక్తులను తీవ్ర నిషాదంలోకి నెట్టింది. 1996లో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జానకీ రామన్ వినాయకుని సన్నిధికి ఈ ఏనుగును బహూకరించారు. అప్పటి నుంచి అక్కడే ఉంటూ స్వామి సేవల్లో పాల్గొంటూ భక్తులను లక్ష్మీ ఆశీర్వదించేది. 32 ఏళ్లు గుడిలో ఉన్న ఏనుగు బుధవారం వాకింగ్ సమయంలో పడిపోయి మృతి చెందింది.